25-08-2015,
చెన్నై - 28
పంపేవారు 
సుంకేశుల V. వేంకటనాగరాజన్, 111, AG3, KALA FLATS, GOVINDASAMY NAGAR, R.A.PURAM, CHENNAI-600028

పుచ్చుకొనేవారు
HIS EXCELLENCY DR. K. ROSAIAH,
GOVERNOR OF TAMILNADU,
RAJ BHAVAN, CHENNAI - 600022

గుణ్యమైన మహాప్రభో, 

విషయము: OOTHUKKADU శ్రీ కాలింగనర్తన కృష్ణుని కోవిల్ కుంభాభిషేకము గురించి

పూజ్యులైన ప్రభువులకు నా సవినయ నమస్సులను సమర్పించుకుంటున్నాను. ఒక సామాన్య ప్రజయైన నేను అతివిలువైన మీ కాలములో ఒక పది నిమిషములను (ఈ ఉత్తరము ద్వారా) తీసుకోవుటను పెద్దలైన తమరు క్షమిద్దురుగాక. 

తమరి మేల్మియగు గమనమునకు 26.10.15 రోజున జరగనున్న OOTHUKKADU శ్రీ కాలింగనర్తన కృష్ణుని కోవిల్ కుంభాభిషేకమును  గురించి నమ్రతతో మనవి జేసుకుంటున్నాను. తద్వైభవోపెతమగు మహోత్సవమునకు తమరు విచ్చేసి మరియు దర్శించి క్రుతక్రుత్యులు కావలెనని నేను ప్రార్థించుకుంటున్నాను. 

OOTHUKKADU శ్రీ కాలింగనర్తన కృష్ణుని కోవిల్ మరియు శ్రీ వేంకటసుబ్బయ్యర్ గారిని గురించిన గొన్ని అంశములు. 
  • ఈ గుడిలో నెలకొన్న శ్రీ కాలింగనర్తన కృష్ణుని విగ్రహము అపౌరుషేయమైనది. అనగా, మానవులచే శిల్పిమ్పపడనిది. అంతే గాదు. మరొక్క చోద్యాస్పదమైన అంశ ఏమనిన - ఐదేండ్ల అర్భాకుండగుచు కృష్ణుడు తనయొక్క కుడి పాదమును పైకెత్తి, తన ఎడమ పాదపు వేళ్ళు కాలింగుని పడిగెలవైపునున్నవాలే కొలువైయున్నాడు. కాని, తన ఎడమ పాదపు వేళ్ళకు మరియు సర్పపు పడిగేలకు మధ్యలో రవంత కసమయుండుట  విచిత్రతమము.
  • OOTHUKKADU శ్రీ వెంకటసుబ్బయ్యర్ అనేటటువంటి నారదాంశసంభూతులు (c.1700 - 1765 CE) కర్ణాటక సంగీత ముంమూర్తులకు పూర్వకాలజులు. తన శైశవముయందే,  కృష్ణుడుని   గానముచే కీర్తించి, తద్వారా తరించాలనేటటువంటి పురుషార్థనిశ్చయము గల్గియుండిన పుణ్యశ్లోకులు. ఇందుకై, ఒక గురువు కోసం ఉపలాటబడుతూ ఎంతగా తిరిగినా లభించక, నిర్వేదచికితులైనప్పటికి కూడా, భాగవతులపథమును గుర్తెరిగి, అన్యులను రోసి, కృష్ణునే శరణుజొచ్చిన కృతపుణ్యపుంజులు. వీరి అకుంటితమైన భక్తిని మెచ్చి, కృష్ణుడే, తనయొక్క కృకంటజూపులతోనే సంగీతకళావైభవము మరియు కవనావైచిత్ర్యమును కూడా వీరికి ప్రసాదిన్చేడు. ఈ సత్యమును వేంకట కవే తనయొక్క కృతిలో కులంకశముగా చెప్పుకున్నారు. ఒకానొక్క దశలో, కృష్ణుని కాలింగనర్తన దర్శనార్తియై, కవి, నాదయోగస్థుడైయుండగా, భక్తులపాలిట కల్పవ్రుక్షమౌ కృష్ణుడు, ఆ లీలను యథాతథముగా వీరికి సాక్షాత్కారించేడనేది స్థలపురాణపు ఇతివ్రుత్తాన్తము.  
  • ఇలాగే తన జీవితపర్యన్తము శైథిల్యమైన స్థితిలోనుండిన OOTHUKKADU శ్రీ కాలింగనర్తన కృష్ణుడి గుడిలోనే కాలమును గడిపిన జీవన్ముక్తులు వేంకట కవి గారు.
ఇటువంటి వైసిష్ట్యముగల OOTHUKKADU శ్రీ కాలింగనర్తన కృష్ణుని కోవిల్ కుంభాభిషేకము సమీపిస్తున్న తరుణములో, తమరు ఈ గుడికు విచ్చేసి మరియు దర్శించి, చరితార్థులు కావలెనని,  కృష్ణుడే తన కలలో చెప్పినట్టుగా, గొప్ప రామోపాసకులైన నా తాతగారు (కాకార్ల శ్రీ జానకిరామ అవధానులు గారు, 86 years) నాతో చెప్పుకున్నరు. అంతే గాదు. దీనిని మీకు మనవి చేయమని కూడా నన్ను శాశించేరు. చిత్రమేంటంటే, 1971నుండి 1976వరకు TAMILNADU GOVERNOR పదవిని వహించిన DR. K. K. SHAH గారే ఇతఃపూర్వం ఈ ఆలయమునకు విచ్చేసిన ఏకైక TAMILNADU GOVERNOR.  

ADDRESS OF THE TEMPLE:

OOTHUKKADU SRI KAALINGA NARTHANA KRISHNAR KOIL, AGRAHAARAM, OOTHUKKADU PO, Via AAVOOR, THIRUVAARUR DISTRICT - 612701. PH: 9442699355

లోక కల్యాణార్థియగు నా తాతగారి ప్రేరణ మేరకు, ఈ విన్నపమును, ఘనమైన ఆస్తికత గలిగిన మీకు సమర్పించుకుంటున్నాను. ఇందులో, నేను ఏ రీతిలోనైన, పొరపాటున హద్దు దాట్టియుంటే, అందుకై నేను క్షమింపపడుదునుగాక.  

ఇంతకూ,
పునప్పునః తన నమస్సులను తెలుపుచుండే,
తమరి ధర్మపరిపాలనమగు ఛత్రచ్ఛాయలో పోషిమ్పపడే సామాన్య ప్రజయైన,

సుంకేశుల V. వేంకటనాగరాజన్